మే 12
Jump to navigation
Jump to search
మే 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 132వ రోజు (లీపు సంవత్సరములో 133వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 233 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 0254: పోప్ లూసియస్-I తరువాత పోప్ సెయింట్ స్టీఫెన్-I, 23వ కేథలిక్ పోప్ అయ్యాడు.
- 1364: 'కాసిమిర్ III', పోలాండ్ రాజు 'జగీల్లోనియన్ యూనివర్సిటీ' (పోలాండ్ లోని అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం)ని నెలకొల్పమని, 'రాజ పత్రం' (రాయల్ ఛార్టర్) ఇచ్చాడు.
- 1459: 'సన్ సిటీ ఇండియా' గా పేరుగాంచిన జోధ్పూర్ ని, రాథోర్ (డ్) వంశానికి చెందిన, రాజ్పుట్ ప్రముఖుడు, 'రావు జోధ్' స్థాపించాడు.
- 1701: నెదర్లాండ్ లోని 'డ్రెన్త్' అనే ప్రాంతం గ్రెగొరియన్ కేలండర్ ని అమలు చేసింది (నిన్నటి రోజు తేది 1701 ఏప్రిల్ 29 నుంచి నేటి తేది 1701 మే 12 కి తేదీలు మారాయి. అంటే ఈ మధ్య రోజులు అన్నీ మాయమయ్యాయి అన్న మాట)
- 1777: మొట్టమొదటి 'ఐస్ క్రీం' ప్రకటన (ఫిలిప్ లెంజి - న్యూయార్క్ గెజెట్ లో ప్రకటించారు).
- 1792: నియమిత సమయంలో దానంతట అదే శుభ్రం చేసుకునే మరుగుదొడ్లు (టాయిలెట్స్ ఫ్లషింగ్) పేటెంటు హక్కులు పొందారు.
- 1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర ఛిలి దేశంలో ఉన్న రాగి గనులను చూడటానికి వెళ్లాడు.
- 1908: 'నాథన్ బి. స్టబ్ల్ఫీల్డ్' 'వైర్లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.
- 1921: మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికాలో జరుపుకున్నారు.
- 1926: బ్రిటన్లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు.
- 1937: కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.
- 1942: 1500 మంది యూదులను 'ఆస్చ్విట్జ్ కాన్సెంట్రేషన్ కేంపు' లో విషవాయువు ద్వారా చంపేసారు. ఈ కేంపు నాజీ జర్మనీ ఆక్రమించిన పోలాండ్ లో ఉంది.
- 1942: అమెరికాకు చెందిన రవాణానౌకను, మిస్సిసిపి నదీ ముఖద్వారం దగ్గర, నాజీ లకు చెందిన యు-బోటు ముంచేసింది.
- 1943: జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.
- 1949: అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది.
- 1951: మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
- 1952: 'గజ్ సింగ్' జోధ్పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
- 1956: తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.
- 1965: సోవియట్ యూనియన్ ప్రయోగించిన రోదసీనౌక లూనా 5 చంద్రుని నేల మీద నెమ్మదిగా దిగలేక కూలిపోయింది. ప్రయోగం విఫలమైంది.
- 1982: 'యు.ఎస్. ఫుట్బాల్ లీగ్' ఏర్పడింది.
- 1984:ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించింది.
- 1984: నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.
- 1986: అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
- 1991: పసిఫిక్ ప్రాంతపు వాయవ్య దిక్కులో దొరికే, అరుదైన మూలికతో కేన్సర్ వ్యాధికి ఒక కొత్త మందును కనుగొన్నారు.
- 1992: ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి బెల్జియం దేశ మహిళ 'ఇన్గ్రిడ్ బేయెన్స్'.
- 1997: ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
- 2002: మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
- 2008: చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
- 2010: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- 2010: 'ఆఫ్రిఖియా ఏర్వేస్' కి చెందిన విమానం కూలి అందరూ మరణించారు ఒక్కడు తప్ప.
- 2012: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయొజెనిక్ ఇంజిన్ ప్రయోగం సఫలమైంది. దీనిని, ఉపగ్రహ ప్రయోగ వాహకం జి.ఎస్.ఎల్.వి-డి5 లో బిగించుతారు. భారతదేశం, అమెరికాను ఈ ఇంజిన్లు అడిగినప్పుడు భారత దేశానికి ఇవ్వకుండగా, భారత దేశానికి అనేకమైన అడ్డంకులను కల్పించింది.
జననాలు
[మార్చు]- 1401 : షొకొ చక్రవర్తి, జపాన్ 101వ చక్రవర్తి (మ. 1428)
- 1820: ఫ్లోరెన్స్ నైటింగేల్, ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (మ. 1910)
- 1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్వవేత్త. (మ. 1986)
- 1899: ఇంద్రా దేవి, లాట్వియన్ యోగా గురువు (మ. 2002)
- 1920: వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత
- 1924: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999)
- 1926: భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త.
- 1937: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008)
- 1945: కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి.
- 1950: షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్
- 1951: గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).
- 1969: చంద్రసిద్ధార్ధ , తెలుగుచిత్రాల దర్శకుడు, నిర్మాత.
- 1980: రుషి సునాక్ , యునైటెడ్ కింగ్ డం ప్రధాన మంత్రి .
- 2003: ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933)
మరణాలు
[మార్చు]- 1871: జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త (నెబ్యులాలను కేటలాగ్ లో ప్రకటించాడు. (నక్షత్ర మేఘాల పట్టిక తయారుచేసిన వాడు)).
- 1922: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868)
- 1946: ధారా వెంకట సుబ్బయ్య, భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు
- 2009: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915)
- 2021: కె.ఎస్.చంద్రశేఖర్ , తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- 'నేషనల్ హాస్పిటల్ డే' ని 1921 నుంచి అమెరికాలో జరుపుకుంటున్నారు.
- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
- అంతర్జాతీయ వలస పక్షుల దినం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 12[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 11 - మే 13 - ఏప్రిల్ 12 - జూన్ 12 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |