మీరు ఎప్పుడైనా మీ Google ఖాతాను తొలగించవచ్చు. మీరు మీ మనసు మార్చుకుంటే, నిర్దిష్ట సమయం తర్వాత మీరు దాన్ని రికవర్ చేయలేకపోవచ్చు.
దశ 1: మీ Google ఖాతాను తొలగించడం అంటే ఏమిటో తెలుసుకోండి
- ఆ ఖాతాలోని ఇమెయిల్‌లు, ఫైల్‌లు, క్యాలెండర్‌లు, అలాగే ఫోటోలు వంటి మొత్తం డేటా అలాగే కంటెంట్‌ను మీరు కోల్పోతారు.
- ఆ ఖాతాతో మీరు సైన్ ఇన్ చేసిన Gmail, Drive, Calendar, లేదా Play వంటి Google సర్వీస్‌లను మీరు ఉపయోగించలేరు.
- ఆ ఖాతాతో మీరు YouTube లేదా Google Playలో కొనుగోలు చేసిన యాప్‌లు, సినిమాలు, గేమ్‌లు, మ్యూజిక్, టీవీ షోల వంటి సబ్‌స్క్రిప్షన్‌లకు, కంటెంట్‌కు మీరు యాక్సెస్‌ను కోల్పోతారు.
నేను నా Google ఖాతాను తొలగించిన తర్వాత ఏమి జరుగుతుంది?
Google Play
- Play స్టోర్ నుండి యాప్‌లు లేదా గేమ్‌లను పొందలేరు లేదా అప్‌డేట్ చేయలేరు.
- మీరు కొనుగోలు చేసిన మ్యూజిక్, సినిమాలు, పుస్తకాలు లేదా వార్తాపత్రికలను మీరు ఉపయోగించలేరు.
- మీరు వేరే చోట కొనుగోలు చేసి, Google Playకి యాడ్ చేసిన ఎలాంటి మ్యూజిక్‌ను అయినా మీరు కోల్పోతారు.
- మీ ఖాతా నుండి మీ గేమ్ ప్రోగ్రెస్, విజయాలు, ఇతర Google Play డేటాను మీరు కోల్పోవచ్చు.
కాంటాక్ట్‌లు
మీ పరికరంలో వేరుగా స్టోర్ చేసిన కాంటాక్ట్‌లు కాకుండా, Google ఖాతాలో స్టోర్ చేసినవి మాత్రమే కోల్పోతారు.
Drive
- డేటా Driveలో సేవ్ చేయబడదు. ఈ డేటాలో మీ పరికరంతో తీసిన ఫోటోలు లేదా మీ ఇమెయిల్‌ల నుండి డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లు ఉంటాయి.
- తొలగించబడిన ఖాతాకు మీరు ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయలేరు లేదా అప్‌లోడ్ చేయలేరు.
మీరు ఏవైనా Chrome యాప్‌లను లేదా ఎక్స్‌టెన్షన్‌లను తొలగించిన ఖాతా కోసం ఉపయోగించలేరు.
అయినప్పటికీ, మీరు వీటిని చేయగలరు:
- తాత్కాలికంగా మీ Chromebookను ఉపయోగించడానికి ఇతరులను అనుమతించడం
- తొలగించబడినది కాకుండా వేరొక Google ఖాతాతో సైన్ ఇన్ చేయడం
నా Google ఖాతా హ్యాక్ చేయబడితే దాన్ని ఎలా తొలగించాలి?
హ్యాక్ అయిన లేదా సురక్షితం కాని Google ఖాతాను తొలగించడానికి ముందు, మీ అనుమతి లేకుండా మీ ఖాతాలోని ఏ భాగాలను యాక్సెస్ చేశారనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి సెక్యూరిటీ చెకప్ను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఆ విధంగా, మీరు హ్యాకర్ వల్ల కలిగే మరింత హానిని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీరు:
-
మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినట్లయితే, అవి యాక్సెస్ చేయబడ్డాయో లేదో మీరు కనుగొనవచ్చు, తద్వారా వాటిని మార్చాల్సిన అవసరం ఉందో లేదో మీకు తెలుస్తుంది.
-
మీ Google ఖాతాలో కాంటాక్ట్‌లను సేవ్ చేసినట్లయితే, అవి డౌన్‌లోడ్ చేయబడ్డాయో లేదో మీరు కనుగొనవచ్చు, తద్వారా అనుమానాస్పద మెసేజ్‌ల విషయంలో మిమ్మల్ని సంప్రదించాలా అనేది మీ కాంటాక్ట్‌లకు తెలియజేయవచ్చు.
-
లావాదేవీల కోసం Google Wallet ఉపయోగిస్తారా, ఏవైనా అనధికారిక పేమెంట్‌లు ఉన్నాయేమో చూసి, వాటిపై వివాదం ప్రారంభించవచ్చు.
ముఖ్య గమనిక: మీ ఖాతా తొలగించబడిన తర్వాత, ఆ ఖాతాలో యాక్టివిటీని రివ్యూ చేయడానికి మీరు ఇకపై సెక్యూరిటీ చెకప్‌ను ఉపయోగించలేరు.
దశ 2: మీ Google ఖాతా సమాచారాన్ని రివ్యూ చేసి, డౌన్‌లోడ్ చేయండి
మీ Google ఖాతాను తొలగించడానికి ముందు:
- మీ ఖాతాలోని సమాచారంను రివ్యూ చేయండి. మీరు ఉంచాలనుకుంటున్న డేటాను డౌన్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
- మీరు ఆన్లైన్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, లేదా యాప్‌ల కోసం మీ Gmail అడ్రస్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ఈ సర్వీస్‌ల కోసం కొత్త ఇమెయిల్ అడ్రస్‌ను యాడ్ చేయండి.
- ఒకవేళ మీరు మీ ఖాతాను తర్వాత రికవర్ చేయడానికి ట్రై చేస్తే, మీ ఖాతా రికవరీ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. రికవరీ సమాచారాన్ని ఎలా జోడించాలో తెలుసుకోండి.
దశ 3: మీ Google ఖాతాను తొలగించండి
ముఖ్య గమనిక: మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే, ఒక దాన్ని తొలగించడం వల్ల మిగతావి తొలగించబడవు.
- మీ Google ఖాతాలో డేటా & గోప్యత విభాగానికి వెళ్లండి.
- "మీ డేటా & గోప్యత ఆప్షన్‌లు"కు స్క్రోల్ చేయండి.
- మరిన్ని ఆప్షన్‌లు
మీ Google ఖాతా నుండి తొలగించండిని ఎంచుకోండి
- మీ యాక్టివిటీని తొలగించడానికి సూచనలను ఫాలో అవ్వండి.
మీ Gmail ఖాతాను తొలగించండి
మీరు మీ Google ఖాతా నుండి మీ Gmail ఖాతాను తొలగించవచ్చు. దాన్ని తొలగించడం వల్ల మీ మొత్తం Google ఖాతా తొలగించబడదు.
ముఖ్య గమనిక: మీ Google ఖాతాను తొలగించినప్పుడు, మీ Gmail ఖాతాతో అనుబంధించబడిన డేటా తొలగించబడుతుంది. మీరు ఇకపై ఆ Gmail ఖాతాకు లాగిన్ చేయలేరు.
మీ Google ఖాతాను తొలగించకుండానే మీ Gmail ఖాతాను తొలగించండి
ముఖ్య గమనిక: మీ Google ఖాతాను తొలగించకుండానే మీ Gmail ఖాతాను తొలగించడానికి, మీ Google ఖాతాతో అనుబంధించబడిన వేరే ఈమెయిల్ అడ్రస్ అవసరం.
- మీ Google ఖాతాకు వెళ్లండి.
- ఎడమ వైపున ఉన్న, డేటా & గోప్యత ఆప్షన్‌ను ఎంచుకోండి.
- "మీరు వినియోగించే యాప్‌లు, సర్వీస్‌ల నుండి డేటా" ఆప్షన్‌కు స్క్రోల్ చేయండి.
- Google సర్వీస్‌ను తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- "Gmail" పక్కన ఉన్న, తొలగించండి
ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు దేనితో సైన్ ఇన్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
- వెరిఫికేషన్ ఈమెయిల్‌ను ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఇప్పటికే ఉన్న మీ ఈమెయిల్ అడ్రస్‌ను వెరిఫై చేయడానికి, ఇప్పటికే ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లో మీరు ఈమెయిల్‌ను అందుకుంటారు. మీ కొత్త ఈమెయిల్ అడ్రస్‌ను మీరు వెరిఫై చేసేంత వరకు, మీ Gmail అడ్రస్ తొలగించబడదు.
నా Google ఖాతా నుండి ఇతర సర్వీసులను ఎలా తీసివేయాలి?
మీరు మీ మొత్తం Google ఖాతాను తొలగించకూడదని అనుకున్నట్లయితే, ఎలా చేయాలో తెలుసుకోండి:
నా ఫోన్ నుండి నా Google ఖాతాను ఎలా తీసివేయాలి?
ఒక ఖాతాను తొలగించకుండా దాన్ని మీ ఫోన్ నుండి తీసివేయడానికి, కింది సూచనలను ఫాలో అవ్వండి. మీకు మీ ఫోన్ కనిపించకపోతే, మీ ఫోన్ తయారీదారుని సైట్‌కు వెళ్లండి.
నేను నా Google ఖాతాను ఎలా రికవర్ చేయాలి?
మీరు మీ మనసు మార్చుకుంటే లేదా అనుకోకుండా మీ Google ఖాతాను తొలగిస్తే, మీరు నిర్దిష్ట సమయం లోపు దాన్ని రికవర్ చేయగలరు. మీ ఖాతాను ఎలా రికవర్ చేయాలో తెలుసుకోండి.