Jump to content

life

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:28, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, జీవము, ప్రాణము, ఆత్మ, ఆయువు, వయస్సు, ఉసురు, బ్రతుకు.

  • they saved my life నన్ను బ్రతికించినారు, నా ప్రాణమును కాపాడినారు.
  • many lives were lost శానామంది నష్టమైనారు.
  • he lost his life వాడి ప్రాణమును పొగొట్టుకొన్నాడు.
  • the conqueror gave them their lives జయించినవాడు వాండ్లను ప్రాణములతో విడిచిపెట్టినాడు.
  • after he was restored to life వాడికి మళ్ళీ ప్రాణము వచ్చిన తరువాత.
  • he is ready to lay down his life for them వాండ్లకై తన ప్రాణమునైనా యిచ్చేవాడుగా వున్నాడు.
  • before he came to life వాడు పుట్టకమునుపు.
  • this will touch his life or this will cost him his life ఇందువల్ల వాడి ప్రాణానికి వచ్చును.
  • I never in my life saw him నా జన్మములో వాణ్ని చూడలేదు, నా ఆయుస్సులో చూడలేదు.
  • during his natural life వాడి శరీరము వుండే వరకు you have along lifebefore you నీకు యింకా నిండా ఆయుస్సు వున్నది, నీవు యింకా నిండా దినాలు బ్రతుకుదువు.
  • he leads a laborious life వాడు యేవేళా పాటు పడేవాడు.
  • they lead an easy life వాండ్లు సుఖప్రాణులు.
  • he entered a new state of life వాండ్లు సుఖప్రాణులు.
  • he entered a new state of life వాడికి వొక నవీనమైన దశ వచ్చనబది.
  • అనగా వివాహముచేసుకొన్నాడు, వర్తకము, వుద్యోగము మొదలైన వాటిలో ప్రవేసించినాడు.
  • he acts of every day life నిత్యకర్మము, నిత్యటిపని.
  • he began life with ten rupees ఆ వ్యాపారములోప్రవేశించినప్పుడు వానికి పదిరూపాయలు వుండినవి.
  • a village granted for three lives మూడుతరాలకు యిచ్చిన గ్రామము.
  • or trade వృత్తి.
  • a farmers life కాపవృత్తి.
  • he wastransported for life వాడు చచ్చే వరకని ద్వీపాంతరమునకు పంపబడ్డాడు.
  • this injured him for life ఇది వాడి ప్రాణమువుండేదాకా విధించినది.
  • he painted them to the life వాండ్లను తత్స్యరూపముగా వ్రాసినాడు, తద్రూపముగా వ్రాసినాడు.
  • he painted her as large as life దాని ఆకారము యెంతో అంతపెద్దదిగా వ్రాసినాడు.
  • Long life to your Majesty తమరుదీర్ఘాయువుగా వుందురుగాక.
  • they danced with great life బహులాఘవముగా ఆడినారు.
  • he has no life (or vivacity) in his speaking వాడు మాట్లాడడములో సరసతలేదు.
  • he was the life of the company వాడు వాండ్లకు జీవాతువుగా వుండినాడు.
  • this gave new life to his undertaking ఇది వాడారంభించిన పనికి వుపబలమైనది.
  • the present life ఇహము.
  • (as opposed to the next life or world which is future) వరము.
  • I cannot tell for the life of me what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు చచ్చినా తెలియదు.
  • he cannot be honest for the life of him (Hannah More) చచ్చినా వాడికి పెద్దమనిషితనము రాదు.
  • a life or memoir చరిత్ర, విజయము.
  • the life of Robinson Criusoe రాబిన్‌సన్ కూస్సో చరిత్ర.
  • the life of Sankara Chari శంకర విజయము.
  • the life of Nala నలోపాఖ్యానము.
  • the Lives of the Poets కవులచరిత్రలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=life&oldid=936796" నుండి వెలికితీశారు