మార్పు (చేప)
Jump to navigation
Jump to search
Walking catfish | |
---|---|
Secure
| |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. batrachus
|
Binomial name | |
Clarias batrachus లిన్నేయస్, 1758
|
మార్పు చేప ఒక ఆహార ప్రధానమైన చేప. ఈ నడిచే పిల్లి చేపలు (Catfish) శాస్త్రీయ నామం క్లారియస్ బట్రాఖస్ (Clarias batrachus). ఇవి మంచినీటి ఆవాసాలలో నివసించే గాలిపీల్చే పిల్లిచేపలు (airbreathing catfish) ఇవి ప్రధానంగా ఆగ్నేయ ఆసియా (Southeast Asia) లో నివసిస్తాయి. వీటి పేరుకు తగినట్లుగా ఇవి కాళ్ళులేకపోయినా భూమి మీద మంచినీటిగుంటలు దొరికే ప్రాంతాలకు పాము మాదిరిగా ప్రాకుకుంటూ నడవగలవు.[1] ఈ విధమైన చలనం మూలంగా తేమ వున్నంతవరకు ఇవి నీటి బయట బ్రతుకగలవు.[1] ఇవి సామాన్యంగా నిలకడగా ఉండే బురద నీటిలో జీవిస్తాయి. కుంటలు ఎండిపోయినప్పుడు మరొక నీటికుంటకు పాకుకుంటూ కదిలిపోతాయి.
లక్షణాలు
[మార్చు]- పొడవైన దేహము కలిగి సుమారు 45 సెం.మీ.వరకు పెరుగుతుంది.
- అణచబడిన తల, పృష్ట, పార్శ్వతలములలో అస్థిఫలకములుండుట, గుండ్రని అనుకపాల కీలితములు కలిగివుండడం ఈ చేపల ప్రధాన లక్షణములు.
- ముట్టె మీద 4 జతల మీసాలు, మొప్ప కుహరములో అనుబంధ శ్వాసాంగాలు, కంటకములతో కూడిన ఉరోవాజములు, పొడవైన పృష్ట, పాయు వాజములు, గుండ్రని పుచ్ఛవాజము, బూడిద రంగు దేహము.
- లోతు జలాల్లో పరభక్షక జీవనాన్ని గడుపుతుంది. చిన్న చేపలను, రొయ్యలను, లార్వాలను, క్రిములతోపాటు శైవలలను ఆహారంగా తీసుకుంటుంది.
- కృత్రిమ చెరువుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Catfish 'walk' down street". Metro.co.uk. 2008-07-18. Retrieved 2008-07-18.
బయటి లింకులు
[మార్చు]- Ros, Wolfgang (2004): "Clarias batrachus - Erfolgreiche Froschwels-Nachzucht im Aquarium", Datz 57 (7): 12-15.
- Ros, Wolfgang (2006): "Clarias batrachus - Auslösen der Fortpflanzung bei Froschwelsen", Datz 59 (4): 33-37.
- Thoughts on a Catfish Archived 2009-04-25 at the Wayback Machine