రోషగాడు
రోషగాడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | చిరంజీవి, మాధవి సిల్క్ స్మిత |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
రోషగాడు 1983 లో కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి నటించారు .
కథ
[మార్చు]చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. తరువాత జరిగే వెంటాడే సీనులో సికిందర్ ప్రమాదానికి గురవుతాడు. అంతకు ముందు అతడు ఓ బిచ్చగాడికి ఓ డైరీ ఇస్తాడు. ఆ డైరీలో సికిందర్ దాచిన దోపిడీ సొమ్ము వివరాలు రాసి ఉంటాయి
సికిందర్ మరణం తరువాత, శ్రీకాంత్ పట్టణానికి వచ్చినపుడు, అతనే సికిందర్ అని భావించి స్మగ్లర్లు పట్టుకుంటారు. స్మగ్లర్లను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న రహస్య పోలీసు అధికారి సిల్క్ స్మితతో పాటు వారంతా అతన్ని హింసిస్తారు. శ్రీకాంత్ సికిందర్ కాదని స్మితకు అర్థమౌతుంది. ఇద్దరూ కలిసి తప్పించుకుంటారు. ప్రధాన విలన్ కన్నడ ప్రభాకర్ శ్రీకాంత్ సోదరితో పట్తుకుని చంపుతాడు. శ్రీకాంత్ తప్పించుకొని ప్రభాకర్తో సహా స్మగ్లర్లందరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు.
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "చిన్నదాని కోరచూపు" | ఎస్. జానకి | |
2. | "నేనంటే చూడు నేనే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | |
3. | "యవ్వనమా నికు స్వాగతమ్" | ఎస్. జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | |
4. | "అచ్చట్లా ముచ్చట్లా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల |
5.రాలు గాయి ప్రాయం రావాలి , రచన: రాజశ్రీ, గానం.ఎస్.జానకి కోరస్.