1900 వేసవి ఒలింపిక్ క్రీడలు
1896లో తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైన తరువాత ప్రతి నాలుగేళ్ళకోసారి నిర్వహించాలనే ప్రాతిపదికన 1900లో రెండో ఒలింపిక్ క్రీడోత్సవాలను పియరీ డి కోబర్టీన్ స్వంత దేశమైన ఫ్రాన్స్లో సుందరనగరమైన పారిస్లో నిర్వహించారు. 19000, మే 14 నుంచి అక్టోబర్ 28 వరకు సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ పోటీలకు ఆరంభ, ముగింపు ఉత్సవాలు నిర్వహించబడలేదు. 24 దేశాల నుంచి 997 క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకున్న ఈ ఒలింపిక్స్‌లో నిర్వాహక దేశమైన ఫ్రాన్స్ 26 స్వర్ణపతకాలతో ప్రథమస్థానం పొందినది.
అత్యధిక పతకాలు పొందిన దేశాలు
[మార్చు]19 క్రీడలు, 95 క్రీడాంశాలలో జరిగిన పోటీలలో 26 క్రీడాంశాలలో నెగ్గి నిర్వాహక దేశమైన ఫ్రాన్స్ పతకాల పట్టికలో ముందంజలో నిలిచింది. అమెరికా, బ్రిటన్‌లు ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి. బ్రిటీష్ ఇండియా తరఫ్ఉన పోటీలో పాల్గొన్న అథ్లెటిక్ క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలను సాధించి భారత్ను 17వ స్థానంలో నిలిపాడు.
స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం 1 ఫ్రాన్స్ 26 41 34 101 2 అమెరికా 19 14 14 47 3 బ్రిటన్ 15 6 9 30 4 సంయుక్త జట్టు 6 3 3 12 5 స్విట్జర్లాండ్ 6 2 1 9 6 బెల్జియం 5 5 5 15 7 జర్మనీ 4 2 2 8 8 ఇటలీ 2 2 0 4 9 ఆస్ట్రేలియా 2 0 3 5 10 డెన్మార్క్ 1 3 2 6
నిర్వహించిన క్రీడలు
[మార్చు]
|
1900 ఒలింపిక్ క్రీడలలో భారత్ స్థానం
[మార్చు]1900 నాటికి భారత్ బ్రిటీష్ పాలనలో ఉండుటవలన భారత్ తరఫున పాల్గొన్న ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ బ్రిటీష్ ఇండియా తరఫున పాల్గొన్నాడు. ఇతడు భారత్ తరఫున పాల్గొన్న తొలి ఒలింపిక్ క్రీడాకారుడిగా క్రీడా చరిత్రలో స్థానం సంపాదించాడు. 200 మీటర్లు, 200 మీటర్లు హార్డిల్స్ పోటీలలో పాల్గొని రెండింటిలోనే రజత పతకాలను సాధించి భారత్ తరఫున ఒలింపిక్ పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగానూ రికార్డు సృష్టించాడు. ఇతడు 100 మీటర్లు, 110 మీటర్లు హార్డిల్స్, 60మీటర్లు పరుగులో కూడా పాల్గొన్నాడు. ఇతడు సాధించిన రెండు రజత పతకాల వలన భారత్ పతకాల పట్టికలో 17వ స్థానంలో నిలిచింది.