జిహాద్
జిహాద్ (Jihad) అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే ఆంగ్ల పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, వాక్కు, వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవ మార్గంలో పోరాటం) అంటారు.[1] ఇస్లాం మతంలో నాల్గవ స్తంభము జిహాద్. దీనిని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.
- మీతో పోరాడే వారితో మీరు దైవ మార్గంలో పోరాడండి. అయితే హద్దు మీరకూడదు. హద్దు మీరి ప్రవర్తించేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. వారు మీకు ఎక్కడ ఎదురైనా సరే పోరాడండి. వారు మిమ్మల్ని ఎక్కడనుండి వెళ్ళగొట్టారో ఆక్కడనుండి మీరూ వారిని వెళ్ళగొట్టండి. హత్య తీవ్రమైన విషయమేగాని హింసా పీడనలు అంతకంటే తీవ్రమైన విషయాలు. వారు ప్రతిష్ఠాలయం దగ్గర మీతో పోరాడనంత వరకూ మీరు కూడా వారితో పోరాడకండి. అయితే వారు అక్కడా కయ్యానికి కాలు దువ్వితే మీరు కూడా వారిని నిస్సంకోచంగా ఎదుర్కొని హతమార్చండి. సత్య తిరస్కారులకు ఇదే తగిన శిక్ష. (సురా 2: 190, 191)
- పవిత్ర మాసాలు ముగిసిపోగానే విగ్రహారాధికులను యుద్ధంలో ఎక్కడ ఎదురైతే అక్కడ వధించండి. వారిని పట్టుకోండి. వారిని చుట్టుముట్టండి. వారి కోసం అనువైన ప్రతిచోటా మాటువేసి కూర్చోండి. ఒకవేళ వారు క్షమాపణ చెప్పుకొని నమాజ్, జకాత విధులు పాటించడం ప్రారంభిస్తే వారిని వదిలిపెట్టండి. (సురా 9:5)
జిహాద్ (ఆంగ్లం :Jihad : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము). జిహాద్ లో పాల్గొనువారిని "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు.
- జిహాద్ లు రెండు రకాలు
- 1. జిహాద్-ఎ-కుబ్రా
- మనలోని మంచి చెడు ల మధ్య జరిగే అంతర్గతపోరాటం
- 2. జిహాద్-ఎ-సొగ్రా
- మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.
పద ఉపయోగం
జిహాద్ అనే పదము ముస్లిం సమాజములో ఒక సాధారణ పదము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ పదము ఇస్లాం కొరకు "పవిత్ర యుద్ధం" (holy war on behalf of Islam) అనే భావంతో ఉపయోగింపబడుచున్నది.[2] విశాల దృష్టితో చూసిన యెడల, ఈ పదము, హింస, అహింస అనే రెండు భావనలనూ కలిగివున్నది. దీని సాధారణ అర్థం " దైనందిన జీవితంలో చెడు, అన్యాయం, అణగార్పుకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఇస్లామిక్ విలువలతో గూడిన స్వచ్ఛమైన సాధారణ జీవితం గడిపే విధము" [3] అయిననూ ఈ పదము చర్చనీయాంశముగానూ వివాదాస్పదం గానూ ఉంది.
జిహాద్ చరిత్ర
తైమూర్ లంగ్
తైమూర్ లంగ్, 14వ శతాబ్దానికి చెందిన టర్కో-మంగోల్ దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ, మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను "గాజీ" (పవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు చెంగిజ్ ఖాన్ లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.[4]
మూలాలు
- ↑ ఖురాన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ , పబ్లిషర్ష్ - ఇస్లామిచ్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;firestone
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Esposito (2002a), p.26
- ↑ Tamerlane: Sword of Islam, Conqueror of the World, by Justin Marozzi[permanent dead link]
ఇతర పఠనాలు
- Djihad in: ఇస్లాం ఎన్సైక్లోపీడియా.
- Alfred Morabia, Le Ğihâd dans l’Islâm médiéval. “Le combat sacré” des origines au XIIe siècle, Albin Michel, Paris 1993
- Rudolph Peters: Jihad in Classical and Modern Islam
- Nicola Melis, “A Hanafi treatise on rebellion and ğihād in the Ottoman age (XVII c.)”, in Eurasian Studies, Istituto per l’Oriente/Newham College, Roma-Napoli-Cambridge, Volume II; Number 2 (December 2003), pp. 215–226.
- రుడాల్ఫ్ పీటర్, Islam and Colonialism: The Doctrine of Jihad in Modern History, “Religion and Society”, Mouton, The Hague 1979.
- en:Andrew G. Bostom, ed.: "The Legacy of Jihad: Islamic Holy War and the Fate of Non-Muslims"
- en:Muhammad Hamidullah: Muslim Conduct of State
- Muhammad Hamidullah: Battlefields of the Prophet Muhammad
- en:John Kelsay: Just War and Jihad
- ర్యూవెన్ ఫైర్స్టోన్: Jihad. The Origin of Holy War in Islam
- హాదియా దజాని షకీల్ and రొనాల్డ్ మెస్సియర్: The Jihad and Its Times
- en:Majid Khadduri: War And Peace in the Law of Islam
- en:Bernard Lewis: The Political Language of Islam
- en:Abul Ala Maududi: జిహాద్ ఫిల్ ఇస్లాం
- en:Javed Ahmad Ghamidi: మీజాన్
- Biancamaria Scarcia Amoretti, Tolleranza e guerra santa nell’Islam, “Scuola aperta”, Sansoni, Firenze 1974
- J. Turner Johnson, The Holy War Idea in Western and Islamic Traditions, Pennsylvania State University Press, University Park, Pa. 1997