ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label TELUGU CULTURE. Show all posts
Showing posts with label TELUGU CULTURE. Show all posts

THE IMPORTANCE OF GOLDEN JEWELLARY IN INDIA - LIST OF JEWELLARY TO WEAR IN WEEK DAYS


భారతీయ సంప్రదాయంలో నగలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. 

ఈరోజుల్లో నగలు ఆడవారికి పరిమితం ఐనా వేద కాలంలో మగవారు కూడా నగలు ధరించేవారు.ఆడవారు వివిధ రకాలైన ఆభరణాలు ధరించడంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. నుదుట పాపిట బిళ్ళ, నడినెత్తిన సూర్య చంద్రులు, జుట్టుకు నాగరం, చెవులకు జూకాలు, లేదా కమ్మలు, ముక్కుకు పుడక, మెడలో హారాలు, భుజాలకు దండ వంకీలు, చేతులకు కడియాలు, గాజులు, నడుముకు వడ్డానం, వేళ్ళకు ఉంగరాలు, కాళ్ళకు పట్టీలు, కాలి వేళ్ళకు మట్టెలు... ఇలా ఒక స్త్రీ యొక్క ప్రతి అవయవానికి నగలు ఉద్దేశ్యించబడ్డాయి. అవన్నీ కూడా స్త్రీల ఆరోగ్యం ను దృష్టిలో పెట్టుకుని నియమింప బడ్డాయి.

మళ్ళి ఇందులో రక రకాల గ్రహాలను బట్టి రకరకాల విలువైన జాతి రత్నాలతో కూడిన నగలు ఉంటాయి.

ఆదివారం : సూర్యుని కోసం కెంపుల ఆభరణాలు

సోమవారం: చంద్రుని కోసం ముత్యాల ఆభరణాలు,

మంగళవారం:కుజుని కోసం పగడాల ఆభరణాలు

బుధవారం : బుధుని కోసం పచ్చల ఆభరణాలు

గురువారం : బృహస్పతి కోసం పుష్యరాగ ఆభరణాలు

శుక్రవారం: శుక్రుని కోసం వజ్రాల ఆభరణాలు

శనివారం : శని కోసం నీలమణి ఆభరణాలు

ఇలా రోజుకి ఒక రత్నం తో చేసిన నగలు నిలువెల్లా ధరించేవారు. వీటినే "ఏడువారాల నగలు " అని అంటారు.

INDIAN TRADITIONS AND BELIEFS ABOUT GOD



రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే!?

రవ్వతో చేసిన గంజిని దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా లావుగా ఉండే వారు సన్నగా అవుతారట. రజస్వల సమస్యలు, వివాహం వాయిదా పడుతూ పోతుంటే ఆ జాతకులు దేవి ఆలయానికి వెళ్లి మంగళవారం రవ్వతో చేసిన గంజిని దేవతకు నైవేద్యం చేసి పంచాలి. కానీ దాన్ని వారు తినకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అలాగే ఎవరికి సంతానం ఉండదో, ఎవరికి గర్భం నిలవదో, ఎవరికి గర్భస్రావం అవుతుంటుందో, ఎవరికైతే పిల్లలు పుట్టిన తర్వాత చేతిలో నిలవరో అటువంటి వారు గురువారం లేదా శుక్రవారం రోజు గోధుమ రవ్వ పాయసాన్ని దేవునికి 16వారాల పాటు పూజ చేసి ప్రసాదాన్ని పంచి, తాము కూడా తింటే పైన పేర్కొన్న దోషాలు తొలగి మంచి సంతానం కలుగుతుంది.

ANCIENT HISTORY OF INDIA - BRIEF FACTS ABOUT JHAMBHU DWEEPAM AND ITS EXISTENCE AND ORIGIN


జంబుద్వీపం:

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

8 ) భద్రస్వ వర్ష

(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

భారత్ మాతా కి జై !

BRIEF DETAILS ABOUT INDIAN MARRIAGE AND ITS CUSTOM AND TRADITION



వేద మంత్రాలు.. ఏడడుగులు

మంచిర్యాల సిటీ : వేద మంత్రాలు, ఏడడుగులు, తలంబ్రాలు, కొత్తబట్టలు, బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, మిత్రుల నృత్యాలు, అప్పగింతలు, విందు భోజనం.. ఇదీ పెళ్లి జరిపించే సంప్రదాయం. నాటి కాలంలో మొదలైన ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆధునిక యుగంలోనూ నేటి యువత నాటి సంప్రదాయాన్నే గౌరవిస్తూ.. ఆ పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటోంది.

గుడిలో దండలు మార్చడం, రిజిష్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలతో సరిపెట్టుకుపోవడం వరకు కాలం మారినా సంప్రదాయానికి తమ ఓటు అని అంగీకరిస్తున్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల పాటు గుర్తుగా ఉంచుకోడానికి సంప్రదాయాన్ని మరువడం లేదు. కాలంతోపాటు మనుషులూ మారుతున్నారు. వారి జీవన శైలీ మారుతోంది. ఆస్తులు, అంతస్తులు పెరిగి పోతున్నాయి. వ్యక్తుల స్థోమతకు తగిన విధంగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నారు.

వరపూజ..
అబ్బాయి, అమ్మాయికి ఒకరికి ఒకరు ఇష్టమైన తరువాత జరిగే మొదటి కార్యక్రమం వరపూజ. మంచి శుభదినాన్ని ఎంపిక చేసి శుభలేఖను రాసి పండితులు వధూవరుల పెద్దలకు అందజేస్తారు. ఇరువురి ఇంట్లో భోజనాలు చేస్తారు. ఒకరికొకరు కొత్త బట్టలు పెట్టుకుంటారు.

గణపతి పూజ..
వివాహంలో తొలి పూజ. ప్రతి పూజా కార్యక్రమంలో గణపతి పూజ చేయడం హిందూ సంప్రదాయం. వధూవరులకు ఎలాంటి కష్టాలు రానివ్వరాదని కోరుతూ చేసే పూజ ఇది.

గౌరీపూజ..
వధువుకు సంబంధించిన పూజ ఇది. సకల దేవతలకు పూజనీయురాలైన గౌరీ మాతను పూజించడం సంప్రదాయం. ఈపూజతో అష్టైశ్వర్యాలు కలిగి వివాహ బంధంలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం.

సుముహూర్తం
వివాహ వేడుకకు లగ్న పత్రికలో పెట్టుకున్న ముహూర్తానికి అనుగుణంగా జీలకర్ర బె ల్లం తల మీద వధూవరులు పెట్టుకోడమే అసలైన సుముహూర్తం. దీన్నే ముహూర్త బలం అంటారు. దీంతో వధువు వరుడి సొంతం అయినట్టుగా భావించాలి.

అరుంధతి నక్షత్రం
పెళ్లి ముహూర్తం రాత్రి, పగలుతో సంబంధం లేకుండానే అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకి చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూడటం వలన దంపతుల సంసారం సుఖఃశాంతులతో ఉంటుందని నమ్మకం.

తలంబ్రాలు
వివాహనికి చివరి అంకం ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం. సంసార నౌకకు ఇద్దరూ సమానమే. ఒకరికి ఒకరు సమానమే. పసుపుతో కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. వీటిని వధూవరులు ఒకరి తలపై ఒకరు ఆనందంగా పోసుకుంటారు. కష్టం, సుఖం ఇద్దరికీ సమానమనే భావం కలిగించేది తలంబ్రాలు.